*నేటిసాక్షి* ఏప్రిల్ 8 తిరుమలాయపాలెం (రుద్రరాజు)ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిసర ప్రాంతాలైన పాపాయిగూడెం ఏదుల చెరువు బీచురాజు పల్లి తండా బాలాజీ నగర్ తండా రమణ తండ బలరాం తండా రైతులు అందరు కలిసి పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ ను కలిసి పరిస్థితిని వివరించారు. చావా శివరామకృష్ణ వెంటనే సానుకూలంగా స్పందించి మంత్రి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి తో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్, కాంగ్రెస్ మండల నాయకులు గుగ్గిళ్ళ అంబేద్కర్, పుసులూరి సురేష్, గుగులోత్ వీరన్న, షేక్ సైదా, ఇస్లావత్ రవి,జాల కిరణ్, చామకూరి సాయి, మరియు రైతులు గంధసిరి శ్రీను, మాలోత్ ఉపేందర్, బానోత్ శ్రీను, గుగులోతు వెంకన్న, వీరయ్య, ధారావత్ ఉపేందర్ ,పుల్లకాని రమేష్, వెంకటేశ్వర్లు, చెక్కల వీరన్న ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.





