నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ లోని కాజీపేట రైల్వే స్టేషన్ నందు రహస్య ప్రదేశం రవాణా సిద్ధంగా వున్న నాలుగు కిలోల గంజాయి బ్యాగ్ ను మంగళవారం పోలీస్ జాగిలానికి చిక్కింది. వివరాల్లోకి వెళితే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు ఈ రోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ఫ్లాట్ ఫారం 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల రహస్యం భద్రపర్చిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీసులు బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో నాలుగు కిలోల గంజాయిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఇన్స్ స్పెక్టర్ సురేష్, ఆర్. ఐ శివకేశవులు,ఆర్. ఎస్. ఐ లు పూర్ణ, మనోజ్, నాగరాజుతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





