- విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు అవారి చందు
- భట్టి బడ్జెట్ – వట్టి బడ్జెట్
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్రం లోని బడుగు బలహీనవర్గాలను మోసం చేసే విధంగా ఉంది అని విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు అవారి చందు విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్ లో కేవలం 7% మాత్రమే కేటాయించడం ప్రభుత్వానికి విద్య వ్యవస్థ పట్ల ఉన్న చిత్త శుద్ధి తెలుస్తుందన్నారు. అలాగే మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2500 రూ. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయూత ద్వారా వృద్దులకు,వితంతులకు, బీ డి కార్మికులకు 2వేల నుండి 4 వేలు పెంపుపై విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, నిరుద్యోగ భృతి 4 వేలు, ఈ బడ్జెట్ లో ఊసే లేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రైతులను దగా చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. సగం కూడా పూర్తి కాని రైతు రుణమాఫీ.. మాఫీ పూర్తయిందని బడ్జెట్ లో చదివి అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టింది ఈ బడ్జెట్.వ్యవసాయ రైతు కూలీలు ఈ రాష్ట్రంలో సుమారు కోటి మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 12000 కోట్లు కేటాయించాలి కానీ 600 కోట్లతో సరిపుచ్చి రైతు కూలీలను మోసం చేశారు. దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయ హస్తం ద్వారా 12లక్షలు ఇస్తాము అని హామీ ఇచ్చి బడ్జెట్ తో దళితులను మరో సారి దగా చేశారన్నారు.ఈ బడ్జెట్ లో కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసేలేదు.ఇది పూర్తిగా లోప భూయిష్టమైన బడ్జెట్.. ఇది కాంగ్రెస్ మార్క్ మోసపూరిత బడ్జెట్. ఏ రంగం చూస్కున్నా సరైన కేటాయింపులు లేవు..ఆదాయం ఎలా సమకూర్చుకుంటారు. రెవెన్యూ లోటు ఎంత స్పష్టంగా చెప్పలేక పోయారాన్నారు. మొత్తానికి తెలంగాణ బడ్జెట్ జూట బడ్జెట్ అని మరోసారి నిరూపితం అయిందన్నారు. అంకెల గారడీ తప్ప ఆచరణ సాధ్యం కానీ విధంగా ఉందన్నారు.





