- స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
- కిష్టప్పపేట, సింగపురం మామిడి వలసలలో పింఛన్లు పంపిణీ

నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో :
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతినెల పించన్ దారుల ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం పరిధిలోని కిష్టప్ప పేట, సింగపురం మామిడివలస గ్రామాలలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ స్వయంగా పింఛన్లు పంపిణీలో పాల్గొని మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి ₹4,000 పింఛను ఒకటో తేదీనే అందజేస్తున్నామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అవ్వ, తాతలు, ఒంటరి మహిళలు, నిరుపేదల, దివ్యాంగుల, ముఖాల్లో సంతోషం రెట్టింపు అయిందని చెప్పారు. గత ప్రభుత్వంలో పింఛన్ దారులు అనేక అవస్థలు పడే వారిని, పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియని తికమక పరిస్థితి నెలకొనేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు విజన్ను ఆకర్షితులైన పెట్టుబడుదారులు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని వివరించారు. పింఛన్లు తొలగిస్తారు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ప్రజలు సంతోషంగా ఉండడం తట్టుకోలేక వారిలో ఆందోళనలో రేకెత్తిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చంనాయుడు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, కాలువలు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం మరింత చేరువ చేస్తానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పింఛన్ దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

