నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం గంగారాంతండా గ్రామంలో నాటుసారా అమ్ముతూ పట్టుబడిన భూక్యా రామేశం అను వ్యక్తిపై ఇది వరకు కేసు నమోదు చేసి కొడిమ్యాల తహసీల్దార్ ముందు బైండోవర్ చేయగా,మళ్ళీ అతను బైండోవర్నీ అతిక్రమిస్తూ మరల గుడుంబా అమ్మడంతో అతడిని కొడిమ్యాల తహసీల్దార్ ముందు హాజరు పరచడంతో అతనికి రూ.50000 జరిమానా విధించగా నిందితుడు మంగళవారం జరిమానా చెల్లించి జరిమానా కట్టిన రశీదును జగిత్యాల ఎక్సైజ్ సిఐ కు అందించడం జరిగింది.జగిత్యాల స్టేషన్ పరిధిలో ఎవరైనా నాటుసారా తయారు చెయ్యడం,కలిగి ఉండటం,అమ్మడం,రవాణా చెయ్యడం మరియు నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును కలిగి ఉన్నట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల అబ్కారీ సీఐ సర్వేశ్వర్ హెచ్చరించారు.





