నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మంగళవారం జునియర్ విద్యారులు సీనియర్ విద్యార్తులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్కి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కళాశాల ప్రిన్సిపాల్ మాలోతు సంగీత, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ కళాశాల బెజ్జంకి ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుమన్, మరియు ప్రభుత్వ జానియర్ కళాశాల, మాథమెటిక్ట్స్ లెక్చరర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, విద్యార్థులను ఉద్దేశిస్తూ తెలంగాణ ఆదర్శ పాఠశాల & జానియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు విశిష్ట అతిధులగా విచ్చేసిన వారు విద్యార్థులను ఉద్దేశిస్తూ పలు సూచనలు, సలహాలను, సూచించారు. ప్రతి విద్యార్థి, ప్రభుత్వం అందిస్తున్న విద్యావకాశాలను సద్వినియోగ పరుచుకొని, ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చనీ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను ఆధిరోహించగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఆట-పాటలతో మరియు సాంసృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




