
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని తూర్పువాడ ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో మామిడి చెట్లకు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా సంఘ సభ్యులంతా కలిసి మామిడి చెట్లకు వేదమంత్రాలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు..కళ్యాణ మహోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ ముదిరాజుల కులవృత్తి అయిన మామిడి తోటల పెంపకంలో భాగంగా నూతన చెట్లకు కళ్యాణం చేయడం గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుందని ఇందులో భాగంగా నేడు తూర్పు వాడ ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ కలిసి చెట్లకు కళ్యాణం చేయడం జరిగిందని తెలిపారు.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సంవత్సరం మామిడి చెట్లు బాగా కాశీ మంచిగా ఉండాలని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.





