Wednesday, March 11, 2026

20 న హన్మకొండలో వేల గొంతులు లక్ష డప్పుల సన్నాహక భారీ ప్రదర్శన

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, (సందెల రాజు) : ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిని గుండెల్లో దాచుకుంటాం. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ ఈ నెల 20 వ తేదీన హనుమకొండ లో భారీ స్థాయిలో నిర్వహించ బోతున్న వేల గొంతులు లక్షల డప్పుల సన్నాహక మహా ప్రదర్శనకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి వేలాది డప్పులతో విజయవంతం చేయలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ పిలుపునిచ్చారు. ఎలుకతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఈర రమేష్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దల సుకుమార్ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు కావడం వల్ల ఒక్క మాల కులం మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కానీ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే ఎస్సీలలో 59 కులాలు అభివృద్ధి చెందుతారని అన్నారు. అందరికీ న్యాయం జరగడాన్ని ఓర్చుకోలేని స్వార్థ పరులైన మాలలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేవలం ఒక్క మాల కులంలోని స్వార్థపరులె వ్యతిరేకం తప్ప సమాజం మొత్తం అంగీకరిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాలలు ఒక్క శాస్త్రీయ కారణం చెప్పలేదని అన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న బిసి, ఓసి, ఎస్టీ, మైనార్టీ, మహిళా నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ పైశాచిక దాడులు చేయడం మాలల నీచపు మనస్తత్వనికి నిదర్శనమని అన్నారు. సమాజంలో అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ వర్గీకరణను కోరుతున్నారని వారిని దుషించి మాలలు సమాజంలో ఒంటరిగా మిగిలిపోవద్దని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో బూతులు మాట్లాడి, అసభ్య పదజాలంతో దూషించి అనాగరిక పద్ధతులు అవలంభించి ఎస్సీ వర్గీకరణను బలపరిచే శక్తులను అడ్డుకోలేరని అన్నారు. ఎస్సీ వర్గీకరణను బలపరుస్తున్న డా. పృథ్వీ రాజ్ యాదవ్, విమలక్క, తెలంగాణ విఠల్, ఇస్మాయిల్, దరువు అంజన్న, రేలారే గంగా, నల్లగొండ గద్దర్, మొదలగు నాయకులను మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుందని అన్నారు. వారి నిబద్ధత చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా జరుగుతున్న ఈ ఘోరమైన కుట్రలను ఎదుర్కోవడం కోసమే ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దాన్ని జయప్రదం చేయడం కోసమే ఈ నెల 20 న హనుమకొండ లో వేలాది డప్పులతో సన్నాహక మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ,అలాగే గౌరవ అతిథులుగా ఎస్టీ, బీసీ, ఓసి, మైనార్టీ,ఎస్సీ కుల సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎలుకతుర్తి మండల అధ్యక్షులు ఈర రమేష్ మాదిగ, మండల కార్యదర్శి ఎల్తూరి సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ హనుమకొండ మండల అధ్యక్షులు బొక్క రాజేష్ మాదిగ , మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు బిక్షపతి మాదిగ , డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు ఆలువాల ఏళ్ళేశ్ మాదిగ, ఎర్ర రాము మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పోగుల రమేష్ మాదిగ, వినయ్ కుమార్ మాదిగ, మారేపెల్లి అనూరుద్ మాదిగ, పోగుల చిరంజీవి మాదిగ, సండ్ర పవన్ మాదిగ, జూపాక ప్రశాంత్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News