- స్వామి వారి పడి పూజలో హాజరైన
- జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల, నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
- కర్నూలు పార్లమెంటు ఎంపి నాగరాజు, పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు…గురు స్వామి అడ్వకేట్ గంగాధర్, డాక్టర్ అభినేష్ ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం కార్యక్రమంలో *జెడ్పి మాజీ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ, కర్నూలు పార్లమెంటు ఎంపి నాగరాజు, పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, మాజీ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించి, భక్తి మార్గంలో ప్రతి ఒకరు ఆసీనులై దైవం పట్ల ఆసక్తి పెంచు కోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, ఆయా కాచం మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

