Friday, March 27, 2026

పదోన్నతితో బదిలీపై వెళ్తున్న అధికారినికి ఘన సన్మానం

నేటి సాక్షి, మందమర్రి:– సింగరేణి ఏరియాలో ఏరియా ఎస్టేట్ అధికారినిగా సేవలందించి, పదోన్నతిపై మణుగూరు ఏరియాకు బదిలీపై వెళ్తున్న అధికారిని స్వప్న ని బుధవారం ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా ఇంచార్జ్ జిఎం అబ్దుల్ ఖాదీర్, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వప్న ను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహుకరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏరియా ఇంచార్జ్ జిఎం అబ్దుల్ ఖాదీర్ మాట్లాడుతూ, ఏరియాలో స్వప్న చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్క అధికారికి ఉన్నత పదవులు రావడం, ఉన్న స్థలం నుండి వేరొక స్థానానికి బదిలీపై వెళ్లడం అనివార్యమని తెలిపారు. అదేవిధంగా గోలేటి నుండి ఏరియా ఎస్టేట్ అధికారినిగా ఏరియాకు విచ్చేసిన నవనీతం కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం రవీందర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఐఈడి డీజీఎం రాజన్న, జనరల్ మేనేజర్ కార్యాలయం, అన్ని గనుల, విభాగాల హెచ్ఓడీలు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News