నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్లూరి నర్సింహులు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబ్యాసం అందించి, నేడు బదిలీపై వెళ్లిన సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
సమావేశంలో నూతన ప్రధానోపాధ్యాయులు షాబోద్దీన్, ఉపాధ్యాయురాలు సునీతా, స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాస్టర్ ఉపన్యాసం ముగిసే వరకు చప్పట్లు కొడుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, వారిని ఎక్కడికి వెళ్ళవద్దని కోరుతూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. వారితో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాస్, సతీష్, రామంచ రవీందర్, బోనాల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు నర్సింహులు గారి సేవలను ప్రశంసించి, భవిష్యత్తులో మరింత విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముక్కిస తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముక్కిస తిరుపతి రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ లింగాల అర్జున్, అంగన్వాడీ టీచర్ వెంకట లక్ష్మి, కార్యదర్శి అనూష, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.