- రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడలను విజయవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : నిత్యం క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీర దారుడ్యంతోపాటు, మానసిక ఉల్లాసం పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం మైదానంలో జన మైత్రి, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ అధికారుల జట్టు, మీడియా ప్రతినిధుల జట్లు తల పడ్డాయి.

రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఏడు పరుగులు తేడాతో మీడియా జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన వారికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు జీపు ప్రారంభం, అనంతరం జిల్లాలో రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణకై పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన జీపును జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో వనపర్తి జిల్లా ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





