- చేతి వేళ్ళను కత్తిరించి .. బెదిరించి..
- 70 తులాల బంగారు నగల అపహరణ
- జాగిలాలతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు




నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
హుజురాబాద్ పట్టణంలో ప్రతాపవాడ లోని రాఘవ రెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్లు బాదితులు తెలిపారు. బోర్ మోటార్ ఎవరో వేసారని, బోర్ ఆపుటకు తలుపులు తీయగానే గుర్తు తెలియని ఇంట్లోకి చొరబడి నగలను అపహరించారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, 8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. అదే ఇంటి పైన ఉండే అతని కొడుకు నాగరాజు, కోడలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగాపై న ఎవరూ లేరు అంతలా అయితే వెళ్లి చూడండి అనేసరికి దొంగలు పై కి వెళ్లలేదని బాధితుడు రాఘవరెడ్డి తెలిపారు. రాఘవరెడ్డి కూతురు మానస ఆరు రోజుల క్రితమే అమెరికా నుండి పుట్టింటికి రాగా ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వెంట తెచ్చుకున్న నగదును గుర్తించి తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దొంగలు ఇంటి వెనకనుండి ఇంట్లోకి చొరబడి నీళ్ల మోటర్ ను ఆన్ చేసి చుట్టు పక్కల నల్లాలు విప్పి పడుకున్న వారికి మెలుకువచ్చే విధంగా చేసి తలుపు తీసి చూసే క్రమంలోచొచ్చుకుని లోపలకి వెళ్లి ఈ చోరీకి పాల్పడడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం చోరీ చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. డాగ్ స్ట్రాడ్ ఇంటి ముందు నుండి నేరుగా రంగనాయకుల గుట్ట వైపు సీసీ కెమెరాలు లేని రోడ్డు గుండానే వెళ్లడంగమనిస్తే దొంగలు పథకం ప్రకారం అటు సీసీ కెమెరాలు, ప్రజలు ఎక్కువగా ఉండరని భావించి వెళ్లినట్లుగా తెలుస్తుంది. బాధితులను చితకబాది హత్యాయత్నానికి పాల్పడి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడడంతో హుజూరాబాద్ పట్టణంతోపాటు జిల్లాలోనే ఈ సంఘటన సంచలనంగా మారింది. రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్ స్ట్రాడ్ ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు న మోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





