Friday, March 27, 2026

నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

  • జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుదవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూళ్ళురుపేట డివిజన్ డి.ఎఫ్.ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారిక తో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారి పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని దొరవారి సత్రం మండలం లోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుండి 2 కి.మీ మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు. పర్యావరణంతో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్య శాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్ అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయవలసిన నిషేదిత చర్యలు, ప్రోత్సహించదగిన చర్యలు, మైనింగ్ లాంటి నిషేదిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేసారు. అక్కరపాకు, మైలంగం, ముచ్చల గుంట, నెలబల్లి, నెల్లూరు పల్లి, వెంగమాంబ పురం, ఏకొల్లు, నేలపట్టు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకో జోన్ ఉందన్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, జీవనశైలి, కార్యకలాపాలు వంటి వాటితో సైంటిఫిక్ మ్యాప్లను త్వరిత గతిన సమర్పించాలని ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జో న్ జిల్లాలో నోటిఫై అయిందని, దాని ప్రకారం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. జోన్ పరిధిలో ఉన్న టూరిజం, మత్స్యరంగం, వాటి అనుబంధ పరిశ్రమలు, డ్రైన్లు, రోడ్లు, కాల్వలు, వ్యవసాయం, ఉద్యాన పంటలు ద్వారా ప్రస్తుతం పొందుతున్న జీవనోపాధుల ఆధారంగా ముసాయిదా ను తయారు చేయవలసి ఉంటుందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలెప్మెంట్ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని దీనిలో సంబంధిత శాఖల అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. జోన్ పరిధిలో మైనింగ్, కొత్త పరిశ్రమలు, శాశ్వత నిర్మాణాలు మొదలగునవి నిషిద్దం అని ఏవైనా పరిశ్రమలు కొత్తగా నెలకొల్పాలంటే పూర్తిస్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. డి.ఎఫ్.ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోనల్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారి ఆవశ్యకత ను సంబందిత అధికారులకు తెలియజేసారు. ఈ సమావేశంలో అడిషనల్ డి.ఎఫ్.ఓ నాగభుషణ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలెప్మెంట్ రీజనల్ డైరెక్టర్ జయచంద్ర, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ టి.ఆర్.వినోద్, ఎఫ్.ఆర్.ఓ సౌజన్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, దొరవారి సత్రం మండలం తాసిల్దార్ శైలా కుమార్, సంబందిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News