నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి (అనంతగిరి):
నిరసన తెలిపే హక్కులను కాలరాస్తూ పోలీసులు ముందుస్తు అరెస్టు లు చేస్తున్నారని బి ఆర్ ఎస్ మండల పార్టి అధ్యక్షులు నల్లా భుపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలీసుల చేసిన ముందస్తు అరెస్ట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయమంటే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు వస్తుందని ప్రశ్నించినందుకు శనివారం భువనగిరి లోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేయించిన కాంగ్రెస్ నాయకులను తమ పార్టీ విడిచిపెట్టదని హెచ్చరించారు. ఆ దాడిని ఖండిస్తూ నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో పోలీసులు అనంతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం అమానుషమన్నారు. కచ్చితంగా రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని స్థానిక ఎలక్షన్లో పూర్తిస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేరలేదని అలాంటి సందర్భాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోరని రాష్ట్రంలో అసమర్ధ కాంగ్రెస్ పాలన నడుస్తుందని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూ వారి సమస్యలను నిత్యం బహిర్గతం చేస్తూ పరిష్కరించే దిశగా పార్టీ పూనుకుందని అలాంటి చర్యలకు కాంగ్రెస్ అడ్డుకట్ట వేస్తూ ముందస్తు అరెస్టు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించే తత్వాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. దీనిలో భాగంగా అనంతగిరి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి , ఉపాధ్యక్షులు ఎండి అఫ్జల్ , పార్టీ సీనియర్ నాయకులు పి. వీరయ్య , బెల్లంకొండ ఏడుకొండలు , పల్లెపు శ్రీను , మారేపల్లి చార్లెస్ , హుస్సేన్, నేలకుర్తి మహేష్ , ఎబి శివ తదితరులను అరెస్ట్ చేశారు.





