- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి-కరీంనగర్:
భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ లతో గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు మంజూరు చేసే యూ డి ఐ డి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేక విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు అన్ని భవిత సెంటర్లను సందర్శించాలని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులు తమ పనులు తాము చేసుకునే విధంగా నేర్పించాలని సూచించారు. భవిత కేంద్రాలకు కావలసిన ప్రత్యేక వస్తువులు, ఆట పరికరాలు, సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అందుకు సంబంధించి కావాల్సిన అవసరాల వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. మేనరిక వివాహాల అనర్థాలు, గర్భిణిగా ఉన్నప్పుడు టీఫా స్కాన్ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భవిత కోఆర్డినేటర్ ఆంజనేయులు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఐ.ఈ.ఆర్.పిలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు





