Sunday, March 29, 2026

మైనింగ్ రంగంలో మహిళా శక్తికి అరుదైన గౌరవం

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మైనింగ్ లో సత్తా చాటిన అతివలకు సన్మానం
  • హాజరైన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
  • రాష్ట్ర స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
  • కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే
  • సింగరేణి సీఎండి శ్రీ ఎన్ బలరామ్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బొగ్గు గనుల్లో పనిచేస్తూ ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఉత్తమ మహిళా ఉద్యోగులు, అధికారులను హైదరాబాద్ లో గురువారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), సింగరేణి సిఎండి ఎన్ బలరామ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సింగరేణి సంస్థలో మైనింగ్ అధికారులుగా భూ గర్భ గనుల్లో విధులు నిర్వర్తిస్తున్న మైనింగ్ అధికారులు అంబటి మౌనిక (పీవీకే 5 ఇంక్లైన్), అల్లం నవ్య శ్రీ(జీడీకే 11 ఇంక్లైన్) లను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంకిత భావంతో పనిచేస్తున్న మహిళా అధికారులను సీఎండీ ఎన్ బలరామ్ ప్రశంసించారు. మహిళలకు భవిష్యత్ లో సింగరేణిలో మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News