- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభోత్సవాలకు శిలా ఫలకాల ఏర్పాటు, బహిరంగ సభకు కావలసిన ఏర్పాట్లను చర్చించారు.బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు బాధ్యతలను మున్సిపల్ కమిషనర్ కు అప్పగించారు.అధికారులు సమన్వయం తో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో, జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించనున్న నేపథ్యంలో మహిళా సమాఖ్య, మెప్ప్మ మహిళలను సభాస్థలికి సురక్షితంగా తరలించి తిరిగి వారి ఇళ్లకు పంపించడానికి అధి కారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మండలాల వారీగా బస్సులు కేటాయించడం జరిగిందని సభకు వచ్చే వారికి భోజనం, మంచినీరు, మజ్జిగ వంటి కనీస సౌకర్యాలు పకడ్బందీగా చేప ట్టాలని సూచించారు.అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి సంచిత్ గంగ్వార్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పి.డి. డిఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు తదితరులు పాల్గొన్నారు.




