నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్:
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గల రాజీవ్ స్వగృహం నందు ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినది. రాజీవ్ స్వగృహం నందుగల ఓ ఇంటి యజమాని తమ బంధువుల ఇంటికి వెళ్లి ఈరోజు ఉదయం తమ ఇంటికి చేరుకోగా తన ఇంటిలో దొంగతనం జరిగిందని గుర్తించిన ఇంటి యజమాని రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సీఐ చంద్రశేఖర్ వెంటనే ఎస్సై నరసింహ రెడ్డి, మహమ్మద్ జహీర్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం ను రంగంలోకి దించారు. వరుస దొంగతనాలు జరిగిన సమాచారాన్ని అందుకున్న డి.ఎస్.పి కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును సీఐ చంద్రశేఖర్, ఎస్సైలను అడిగి తెలుసుకుని విచారణను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ దొంగతనం జరిగిన ఇంటిలో రెండు తులాల బంగారం, 10 తులాల వెండి మరియు 20 వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్ళినట్లు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారని తెలిపారు.





