Saturday, March 21, 2026

పెద్దపులి నాగారం గ్రామం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

  • పెద్దపులి నాగారం, పెద్ద గోల్కొండ మధ్యలో ఘటన
  • బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలు

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన డప్పుకిషోర్, నిడదవెల్లి.సందీప్, రోజులాగే పెద్దపులి నాగారం గ్రామం నుండి బైక్ పై ఉద్యోగానికి వెళ్లారు గ్రామ శివారులో పెద్ద గోల్కొండ నుండి వస్తున్నటువంటి కారు వేగంగా ఢీకొనడంతో పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన డప్పు కిషోర్ కి, ఎడమ కాలు పెరిగినట్లుగా సమాచారం నిడదవెల్లి సందీప్, కి కుడికాలు విరిగినట్లుగా సమాచారం వెంటనే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరు కలిసి శంషాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం తెలియజేసిన వెంటనే అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది పోలీసుల సమాచారం మేరకు కారు పడమటి తండా కారుగా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News