- చంద్రగిరి పట్టణం విజయ నగర్ కాలనీలో భూగర్భ మురుగు నీటి పారధుల వ్యవస్థ నిర్మాణంకు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
- సుమారు 2కోట్ల 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
- ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాటను నెరవేర్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విజయనగర కాలనీ వాసులు
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) చంద్రగిరి : చంద్రగిరి పట్టణంలోని విజయ నగర్ కాలనీలో సుమారు ఇరవై సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .కాలనీలో మురుగు నీటి పారధుల వ్యవస్థ నిర్మాణంకు శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని అర్చకులు పూర్ణుంభంతో,కాలనీ ప్రజలు హారతులు పట్టి, పుష్ప గుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగర్ కాలనీలో సుమారు 2కోట్ల 80 లక్షల రూపాయలతో మురుగు నీటి పారుదల వ్యవస్థ నిర్మాణ పనులకు అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో చంద్రగిరి పట్టణం విజయనగర్ కాలనీలో పర్యటించినప్పుడు కాలనీలోని పలు సమస్యలను గత పాలకులు, అధికారులు ఎన్ని అర్జీలు ఇచ్చిన పట్టించుకోలేదని వాపోయారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గెలిచిన కొన్ని రోజులలోనే కాలనీలోని సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మాకు ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూగర్భ మురుగు నీటి పరధుల వ్యవస్థ నిర్మాణం పనులకను 2 నెలలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని విజయ నగర్ కాలనీ వాసులను కోరారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి,జెడ్పీటీసీ సి యుగంధర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ సభ్యులు రమేష్ రెడ్డి, అమ్ములు, మొక్కల చంద్రశేఖర్ రెడ్డి,ప్రవీణ్ రాయలు, వినోద్ కుమార్ రెడ్డి,సీనియర్ నాయకులు గౌస్ భాషా బాలకృష్ణ మూర్తి, తులసీశ్వర రెడ్డి,మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





