- సన్నాహక సభకు తరలిన ఎమ్మార్పీఎస్ నేతలు
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆద్వర్యంలో ఫిబ్రవరి 07 న హైదరాబాదులో నిర్వహిస్తున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం శనివారం ధర్మపురి పట్టణంలో ప్రజా నాయకుడు ఏపూరి సోమన్న ముఖ్య అతిథిగా నిర్వహించిన సన్నాహక సభకు మద్దతుగా ఎండపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చేన్న కుమారస్వామి ఆధ్వర్యంలో మండలంలోని ఎండపల్లి, గుల్లకోట, కొత్తపేట, పడకల్ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు డప్పు చప్పుళ్ళతో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చెన్న కుమారస్వామి మాట్లాడుతూ హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి ఎస్సీ ఎ.బి.సి.డి వర్గీకరణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.





