Tuesday, March 31, 2026

అపూర్వ విద్యార్థుల సమ్మేళనం

నేటి సాక్షి వీణవంక:
వీణవంక మండలం చల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 1996నుంచి 2001 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. పూర్వపు విద్యార్థులు నాటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పాఠశాలలో రిటైర్డ్ ఉపాద్యాయుడు రాంకుమార్ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ చాలా సంవత్సరాల తర్వాత అప్పట్లో చదువుకున్న మిత్రులను కలవడం చాలా సంతోషకరమని ఈ పాఠశాలల్లో చదివి కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేటు రంగాల్లో రాజకీయ రంగాల్లో రాణిస్తున్నామని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు శాంతి కుమార్ సింగ్, రాంకుమార్, సత్యం రాజు, శ్రీధర్, సురేందర్, ఎస్. వెంకటేశ్వర్లు, సుదర్శన్ , రాజి రెడ్డి, రవి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, రాణి, జయ ప్రద తదితర ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు జనార్ధన్, మల్లారెడ్డి, సంతోష్,ప్రవీణ్, దేవదాస్, రమేష్, నతానియల్, రాం రెడ్డి, పుల్లారెడ్డి, స్వాతి, సునీత, అర్చన, స్వప్న, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News