- కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కి స్వాగతం పలికిన జిల్లా ప్రధాన కార్యదర్శి డికె .స్నిగ్దా రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అధికారిక కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ గారికి డీకే బంగ్లా ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఈరోజు అధికారిక కార్యక్రమాలు రద్దు అవడంతో డీకే బంగ్లా లో బిజెపి నాయకులతో సమావేశమై అనంతరం తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాకు వచ్చిన బండి సంజయ్ గారికి జిల్లా కోర్టు నిర్మాణం గద్వాల పట్టణంలోనే ఉండాలని మరియు పిజెపి క్యాంపులో గాని గద్వాల పట్టణ సమీపంలో ఉండాలని న్యాయవాదులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తపస్ జిల్లా నాయకులు రాష్ట్రంలోని జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఇన్కమ్ టాక్స్ 5 లక్షలకు పరిమితి పెంచాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కేజీబీవీ లో పనిచేస్తున్న సర్వ శిక్షణ అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 25 లక్షలు ఇవ్వాలని ఆరోగ్య భద్రత కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ వైద్య ఆఫీసర్లు 2023 నోటిఫికేషన్ భర్తీ చేయాలని ఎన్ హెచ్ ఎం స్కీం కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్ర కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహులు అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివారెడ్డి అసెంబ్లీ మాజీ కన్వీనర్ రామాంజనేయులు పట్టణ అధ్యక్షుడు బండల వెంకటరాములు బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జ పురం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి కౌన్సిలర్లు త్యాగరాజ్ కుమ్మరి శీను బండల పాండు, రజక జయ శ్రీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

