నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా, ప్రజా పాలన వార్షికోత్సవాలు నిర్వాహన కొరకు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న సందర్భంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, వేణుగోపాల్ లకు, ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి, పూలమాలలు వేసి, షాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని, కార్యకర్తలు పార్టీ శ్రేయస్సు కొరకు, పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు అండగా ఉంటూ, భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, విడతల వారీగా నెరవేరుస్తున్నమనీ, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ సంవత్సరకాలం లోనే వేలాది ఉద్యోగాలు కల్పించామని మాటల ప్రభుత్వం కాదని చేతల ద్వారా ప్రజలకు చేరువైతున్న ప్రభుత్వమని పిసిసి చీఫ్ అన్నారు. నిరంతరం ప్రజా ప్రభుత్వం ప్రజల కొరకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, ప్రజల సానుభూతి పొందవలసిన సమయం ఆసన్నమైందని, ఆయన పార్టీ శ్రేణులకుతెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్, భీంగల్, మోర్తాడ్, జక్రాన్ పల్లి తదితర మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, జై సోనియా
జై జై సోనియమ్మ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.





