నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టియుడబ్యూజే (TUWJ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శిగా వేములవాడ టీ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మూడు జిల్లాల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమి తొలి ఛైర్మెన్, టియుడబ్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులను ఏకాగ్రీవంగా నియమించారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చందుర్తి వాస్తవ్యులు వేములవాడ టీ న్యూస్ జర్నలిస్ట్ అజ్జు భాయ్ నియామకం కావడంతో పలువురు జర్నలిస్టులు చందుర్తి మండల ప్రజలు, హర్ష వ్యక్తం చేశారు





