దూడం శ్రీనివాస్ (నేటి సాక్షి, కరీంనగర్): ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 5 వేల మంది విద్యార్థులతో నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి ఎస్సారార్ కళాశాల మైదానం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద సరస్వతి చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సంద్భంగా జానారెడ్డి మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 75 ఏండ్లుగా ఎన్నో విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నదని తెలిపారు. కళాశాలలో మౌలిక వసతులు, ఫీజురీయింబర్స్, హాస్టల్స్ సమస్యలు, అకాడమిక్ సమస్యలు ఇలా విద్యార్థుల భవిష్యత్ కోసం అనునిత్యం కృషి చేస్తున్నదని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్ నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ నలుమూ లలా విస్తరిస్తూ 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోందని తెలిపారు. గడిచిన 75 ఏండ్లలో ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ మరెన్నో విజయాలను చూసిందని చెప్పారు. అనేక రకాల రంగాల్లో విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ అందిస్తూనే దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ పెద్దన్న పాత్ర పోషించిందని, రాష్ట్ర సాధనకు అనేక వినూత్న కార్యక్రమాలు చేసిలు చేసి, విద్యార్థి లోకాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని నిస్వార్థంగా ఉద్యమం వైపు నడిపించిన ఘన చరిత్ర ఏబీవీపీ సొంతమని గుర్తు చేశారు. కరోనా కారణంగా దేశమంతా ఇండ్లకే పరితమైన పరిస్థితుల్లో ఏబీవీపీ దేశవ్యాప్తంగా ముందుండి ప్రాణాలను సైతం లెక్కచేయక సమాజసేవ వారియర్లుగా పనిచేసిన విషయాన్ని దేశం గుర్తించిందన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఏబీవీపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినూత్నకార్యక్రమాలు నిర్వహించనుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కోడి అజయ్, జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరి బాబు, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామాండ్ల నందు, రాష్ట్ర కార్యాసమితి సభ్యులు అంజన్న, స్టేట్ లాఫోరమ్ కో-కన్వీనర్ ప్రమోడ్, వంశీ, విష్ణు,ప్రదీప్,విగ్నేష్, విష్ణు, ప్రశాంత్, ఆకాశ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..