Sunday, March 15, 2026

సేవా పధకం అందుకున్న ఏసీబి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్

నేటి సాక్షి, కొడిమ్యాల జనవరి 27 : కొడిమ్యాల మండలం తిప్పయపెల్లి గ్రామానికి చెందిన సి హెచ్.శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా లో ఏసీబి, సిఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరచినందుకు,ఉత్తమ సేవా పతకాన్ని ఆదివారం ఘన తంత్ర వేడుకల్లో ఏసీబి, డిజి విజయ్ కుమార్ ఐ పి ఎస్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్బంగా డిజి విజయ్ కుమార్ మాట్లాడుతూ ,రానున్న రోజుల్లో ఇంకా బాగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు సాధించాలని అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలు అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News