నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పై అవగాహన కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రం పోస్ట్ ఆఫీస్ నందు నిర్వహించారు. అనంతరం సిబ్బంది మాట్లాడుతూ.. ఏడాది కి రూ. 550 తో ప్రమాద బీమా చేయించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందుతే ఆ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక భరోసా అందుతున్నారు.18 నుంచి 65 ఏండ్ల లోపు యువతి, యువకులు ఎవరైనా పాలసీ చేయించుకోవచ్చు. మరింత సమాచారం కొరకు దగ్గరలోని పోస్టాఫీస్ లో సంప్రదించాలని కోరారు. పాలసీ తీసుకున్నవారికి ప్రమాద జరిగితే ఐ పి డి కింద రూ. ఒక లక్ష వరకు రీఎంబర్స్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐపిపిబి మేనేజర్ మణికంఠ, ఎస్ పి యం దయాకర్ , బిపిఎం లు హరిప్రసాద్, రామ నర్సయ్య, బ్రహ్మచారి, నరేష్, అబెద, ముని, మోతీలాల్, సందీప్, సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు.





