నేటి సాక్షి,మంచిర్యాల జిల్లా : షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం అయిన ఘటన మండల కేంద్రంలోని కొనంపేట గ్రామ మాజీ సర్పంచ్ డోలె చిన్నక్క-బాపు ఇంట్లో నిల్వ చేసి ఉన్న 25క్వింటల్ల పత్తి నిల్వ ఉంచగా ప్రమాదవశత్తు షార్ట్ సర్చ్యూట్ తో మంటలు అంటుకున్నాయి. స్థానిక యువకులు చుట్టు పక్కల వారు గమనించి బిందెలతో నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇంట్లో మంటలు రావడంతో ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. దాదాపుగా 50నుండి 60వేయిల రూపాయల పంట నష్ట పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు నాయకులు స్పందించి పంట నష్ట పరిహారం వచ్చేలా చూడాలని బాధితులు కోరారు.

