నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ):
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ అంజయ్య అధ్యక్షతన వెనుగుమట్ల గ్రామపంచాయతీ ఆవరణలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించినారు ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా హెచ్ఎండి ఆఫీసర్ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీ యొక్క లావాదేవీ వివరాలు అడిగినట్లయితే మేము నేరుగా బ్యాంకుకు వెళ్లి సంబంధిత అధికారులతో మేము మాట్లాడుతామని తెలియజేయండి డిజిటల్ లావాదేవీలు చెల్లింపు జరుగుతున్నప్పుడు సైబర్ నేరాల సెక్యూరిటీ గురించి ఖాతాదాలకు అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో తన తదనంతరం కుటుంబం అంతే సంతోషంగా బాగుండాలని ఇన్సూరెన్స్ గురించి ప్రధానమంత్రి జీవనజ్యోతి సురక్ష బీమా ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ వీటి గురించి ఖాతాదారులకు వివరించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్ దివ్యవాణి లక్ష్మణ్ మహిళ సంఘాల సభ్యులు రైతులు యువకులు బ్యాంక్ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు





