నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అలాగే నిట్ లాంటి కళాశాలలో సీటు ఇప్పిస్తున్నాను అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బుతో పాటు బంగారు అభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు సుమారు ఐదు లక్షల పదివేల రూపాయల విలువ గల గ్రాముల బంగారు అభరణాల తో పాటు 2 లక్షల 68 వేల రూపాయల నగదుతో పాటు మూడు సెల్ ఫోన్లను, ఐ డి ఎఫ్ సి డెబిట్ కార్డు ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వీరపు నాయుని పల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కొమ్మ వివేకానంద రెడ్డి ఆలియాస్ కిషోర్ రెడ్డి (37) కొద్ది కాలం ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూ వచ్చిన జీతం డబ్బు తన జల్సాలకు ఖర్చు కావడంతో తన తోటి ఉపాద్యాయుల తో స్నేహంగా మంచి వాడిగా నటిస్తూనే వారి వద్ద త్వరలోనే తిరిగి ఇస్తానని డబ్బులు, బంగారు నగలను తీసుకోని వారికి తిరిగి ఇవ్వకుండా సహోద్యోగులను మోసం చేసిన సంఘటనలో నిందితుడు పై అంధ్రప్రదేశ్ లో మూడు కేసులు నమోదు కావడంతో నిందితుడు రెండు నెలలు జైలు జీవితం గడిపిన అనంతరం నిందితుడు తన మకాం ను హన్మకొండకు మార్చుకున్నాడు. ఇక్కడ నిందితుడు కొత్త పేరుతో ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూనే మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాక కొద్ది రోజుల అనంతరం నిందితుడు అందులో పనిచేసే మరో మహిళా ఉపాధ్యాయురాలి పరిచయం చేసుకొన్నాడు. తనకు వరంగల్ ఎన్.ఐ.టి లో పరిచయస్తులు వున్నారని ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని సదరు మహిళా ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆమెవద్ద ఎనిమిది లక్షల రూపాయలతో పాటు ఆమె కొడుకు ఎన్.ఐ.టి లో సీటు ఇప్పిస్తానని 60 గ్రాముల బంగారు అభరణాలు తీసుకుని అక్కడి మకాం మార్చాడు. ఇదే రీతిలో నిందితుడు పేరు మార్చుకొని మరో ముగ్గురు బాధితుల నుండి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసారు. నిందితుడు మోసం దోచుకున్న సోమ్ము తో జల్సాలు చేయడంతో పాటు, ఇంటి గృహోపర కరణాలు, బంగారు అభరణాలు చేయించుకున్నాడు. తాను నివాసం వుంటున్న కిరాయి ఇంటి నుండి సామాను తరలిస్తుండుగా పోలీసులు నిందితుడి పట్టుకోని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పట్టు కొవడం లో ప్రతిభ కనబరిచిన హన్మకొండ పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు. అదే విదంగా ప్రైవేట్ పాఠశాల యజమానులను ఉద్దేశించి కొత్తగా జాయిన్ అయ్యే టీచర్ల యొక్క పూర్తి వివరాలు మరియు వారు ఎక్కడ పని చేసి వచ్చారో, వారి పై ఏమైనా కేసులు ఉన్నాయో విచారించిన తర్వాత నే స్కూల్ లో జాయిన్ చేసుకోగలరని ఏసీపీ విజ్ఞప్తి చేసారు.



