కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్

నేటి సాక్షి, మందమర్రి:-
సింగరేణి ఉద్యోగులందరూ సమిష్టిగా కృషిచేసి సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను ప్రతి ఒక్కరు చేరుకోవాలని సింగరేణి కార్పోరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన ఏరియాలోని కేకే ఓసిపి ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం జి దేవేందర్ ఆయనకు మొక్కను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి, స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేట్ సేఫ్టీ జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, ఎవరికివారు స్వతగా రక్షణ పొందాలని సూచించారు. పని స్థలాల్లో తొందరపాటు తనంతో, చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. పని స్థలాలు నిశితంగా పరిశీలించిన అనంతరమే విధులు నిర్వహించడం మంచిదని, సూపర్వైజర్లు ముందుగా పక్కాగా పని స్థలాలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సింగరేణిని తమదనే భావనతో పనిచేస్తే ప్రగతి ఫలాలు విరబూస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘు కుమార్, కేకే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి ఎం మల్లయ్య, ఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, కేకే ఓసిపి ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సురేష్, ఇంచార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, రక్షణ అధికారి కుష్వా లు పాల్గొన్నారు.





