- ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ వాఖ్యలు సరికాదు
- కాంగ్రెస్ శ్రేణుల ప్రెస్ మీట్
- కౌశిక్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

నేటిసాక్షి, రాయికల్:
రాయికల్ పట్టణంలోని జెఎసి ప్రెస్ క్లబ్ లో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, కాంగ్రేస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు కొండపల్లి రవిందర్ రావు లు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించడం పరుష పదజాలంతో మాట్లాడాన్ని త్రీవంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారని అందుకే ఇలా వ్యవహరించారని అన్నారు. మంత్రులు, అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చెయ్యడం పట్ల చట్ట పరంగా చర్యలు తీకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆనంతరం పార్టీ శ్రేణులంతా పోలీస్స్టేషన్కు వెళ్లి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజారెడ్డి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు రవిందర్ రెడ్డి, శ్రీనివాస్, సామల్ల శ్రీనివాస్, బెజ్జంకి మోహన్ తదితరులు పాల్గొన్నారు.





