నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : గుడి ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొక్కెర కుంట గ్రామస్తులు డిమాండ్ చేశారు. రామడుగు మండలంలోని కొక్కెర కుంట గ్రామంలో కురుమల కులదైవమైన బీరప్ప దేవాలయం రెండు రోజుల క్రితం ధ్వంసం కాగా మంగళవారం మండల కేంద్రంలో కురుమ సంఘం అధ్యక్షులు కడారి వీరయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూస్వాములు పెత్తందారులు అయినా లింగారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఏకమై ఉద్దేశపూర్వకంగానే గుడిని ధ్వంసం చేశారని దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే గుడిని ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకొని వెంటనే వదిలేయడం పట్ల ఎటువంటి మతలబు జరిగిందని ఆరోపించారు. అలాగే ఇట్టి విషయమై స్థానిక ఎమ్మార్వో కు కూడా ఫిర్యాదు చేసిన కనీసం స్పందన లేకుండా ఉన్నదని ఆరోపించారు. గుడిని ధ్వంసం చేసిన వెంటనే ఎస్సై శేఖర్ కు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయని దుస్థితి ఏర్పడిందని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 1,50,000 నిధులతో బోర్వెల్ వేస్తే ప్రభుత్వ ఆస్తిని కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అట్టి వారిపై కేసు నమోదు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.





