- పేద ప్రజలకు అధికవడ్డీ వేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ ల మీద చర్యలు తీసుకోవాలి
- పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ వసూలు చేస్తూ పేదల రక్తం త్రాగుతూ వారికున్న ఆస్తులను జాప్తు చేస్తూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చి వారి ప్రాణాలు తీస్తున్నారు అధిక వడ్డీ వ్యాపారులు
- మాచర్ల ప్రకాష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జోగులాంబ గద్వాల
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లాలో పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీ వ్యాపారులు అప్పుతీసుకున్న వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ చట్టం పరిధిలో ఉన్న పరిమితివడ్డీ ఒక్క రూపాయ వడ్డీ కాకుండా చక్రవడ్డీ, భూచక్ర వడ్డీ క్రింద పేదల ఆస్తులను జాప్తు చేస్తూ పేదల ప్రాణాలు తీస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ అన్నారు. అధిక వడ్డీ వ్యాపారస్థుల మీద కేసులు నమోదు చేయాలనీ అన్నారు. వారి అధిక వడ్డీ వలన పెదాలు వారికున్న అర్ద ఏకరో, ఎకరో అధిక వడ్డీ క్రింద భూములు కోల్పోవలసి వస్తుంది. వారి జీవితాన్నే కోల్పోతారనీ అప్పుతీసుకున్న వారిని రక్తం త్రాగుతున్నారని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ లు వారి సంస్థ లాబాల కోసం టార్గెట్ పెట్టుకొని ప్రజలదగ్గరికి వచ్చి రుణాలు సులభంగా మంజూరు చేసిన తర్వాత అధిక వడ్డీ వేస్తూ వారి కస్టమర్ల ను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని అన్నారు రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాలు బేకతారు చేసి, ప్రభుత్వ నియమాలు బ్రేక్ చేస్తూ అధిక వడ్డీకే పాల్పడుతూ ప్రజలను వేధింపులకు చేసి వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు జిల్లా ఉన్నతాధికారులు అధిక వడ్డీ వ్యాపారుల మీద అధిక వడ్డీ వేస్తున్న ప్రైవేటు ఫైనాన్స్ ల మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారి వేధింపులు పేదల ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. వడ్డీ ఒక్క రూపాయకంటే ఎక్కువ వడ్డీ తీసుకోరాదని అన్నారు.




