Wednesday, March 11, 2026

రాజన్నను దర్శించుకున్న నటుడు తిరువీర్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం టాలీవుడ్ నటుడు తిరువీర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకోని స్వామి వారి సేవలో తరించారు. స్వామి వారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వారి దర్శనం బాగా జరిగిందన్నారు. దర్శన సమయాల్లో రద్దీ ఎక్కువగా వుంటుందేమోనని అనుకున్నట్టు తెలిపారు. దర్శనం చేసుకోవడం తమకు కూడా చాలా సులభంగా ఉందన్నారు. వేములవాడలో ఇంత బాగా ఏర్పాట్లు చేసిన ఈవోకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఏటా కూడా స్వామి వారిని దర్శించుకుంటున్నామన్నారు.స్వామి వారి దర్శనం చేసుకుంటే ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని.. ఈ ఎనర్జీ సంవత్సరమంతా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News