Sunday, March 29, 2026

వరి పొలాలను పరిశీలించిన ఏడీఏ

నేటి సాక్షి, మందమర్రి:- మండలంలోని పొన్నారం, లేమూర్ గ్రామ శివారు వరి పొలాలను గురువారం చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు లతో కలిసి పరిశీలించారు. వరి పొలాలు చిరు పొట్ట దశలో ఉండి, అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు ఆశించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్గి తెగులు ఆశించినప్పుడు వరి ఆకులపై గోధుమ ఎరుపు కలగలిసిన నూలు కండి ఆకారపు మచ్చలు ఏర్పడి, క్రమేణ అవి కలిసిపోయి, ఆకులు ఎండిపోతాయని, మెడ విరుపు సైతం వస్తుందని తెలిపారు. అగ్గి తెగులు నివారణకు ట్రీసైక్లోజోల్ 75 డబ్ల్యూపి కలది 120 గ్రాములు,50 గ్రాముల ప్లాంటుమైసిన్ తో కలిపి పైరు పై పిచికారీ చేసుకోవవాలని సూచించారు. అదే విదంగా కాండం తొలచు పురుగు నివారణకు కార్తాప్ హైడ్రోక్లోరిడ్ 50 శాతం ఎస్పి కలది 250 నుంచి 400 గ్రాములు లేదా క్లోరాంతనిలిప్రోల్ 18.5 ఎస్సి కలది 60 మీ.లీ. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పెంచాల మధు, పెంచాల రంజిత్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News