

నేటి సాక్షి, కొడిమ్యాల: జాబితాలో పేరు రానటువంటి వారు మరల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం జనవరి 26న ప్రవేశ పెట్టబోయే నాలుగు పథకాలపై ప్రజా పాలన- గ్రామసభలు నిర్వహించగా కొడిమ్యాల మండలంలో మంగళవారం నుండి పలు గ్రామాలలో గ్రామసభలు మొదలయ్యాయి.కాగా రాంసాగర్ గ్రామంలోని గ్రామసభను జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు స్కీములలో సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులలో అర్హులైన వారిని గ్రామసభ ద్వారా ఆమోదం తెలపాలని, ఆమోదం పొందిన జాబితాను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని అన్నారు. జాబితాలో పేరు లేని సభ్యులు మరల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో బుధవారం జరుగబోయే జెఈఈ ఎగ్జామ్ సెంటర్ ను పరిశీలించి, జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎమ్మార్వో రమేష్, ఎంపీడీఓ స్వరూప, సీఐ రవి, ఎస్సై సందీప్, ఏఈఓ, టిఏ, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్లు, ప్రజలు పాల్గొన్నారు.





