నేటి సాక్షి, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ముందడుగులో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుండే విధంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. మున్సిపాలిటీ ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సరిస్తామని ఆయన అన్నారు. ముందుగా ప్రత్యేక అధికారి ప్రపుల్ దేశాయ్ ని మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పుష్ప గుచ్చలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఎంఏఈ నరేష్, టీపీఓ శ్రీధర్, భాస్కర్, వాణి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.





