నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల లోని ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి బి.ఎస్. లత బుధవారం పరిశీలించారు.ఈ నెల 27 న జరగబోయే మెదక్ నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేందుకు గాను తగిన ఏర్పాట్ల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఎంపిక చేసిన 225, 226, 227, 228 నాలుగు పట్టభద్రుల పోలింగ్ స్టేషన్ లని, 142 ఉపాధ్యాయుల పోలింగ్ స్టేషన్ ని సందర్శించి తగు సూచనలు చేశారని, ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ తో పాటు ఆర్డీవో జీవాకర్ రెడ్డి, గిర్ధావర్ రాజేందర్ రావు పాల్గొన్నారు, కోరుట్ల తహసిల్దార్ ఇట్యాల కిషన్ తెలిపారు.





