Thursday, March 12, 2026

రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్. దూలూరి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో గల ఆరపేట 5వ వార్డులో అడిషనల్ కలెక్టర్ బిఎస్. లత శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రేషన్ కార్డుల సర్వే పారదర్శకంగా చేపట్టాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, తహసీల్దార్ శ్రీనివాస్, మేనేజర్ వెంకటలక్ష్మి, ఆర్ఐ అక్షయ్, మెప్మా టిఎంసి సోమిడి శివ, ముజీబ్, వార్డు ఆఫీసర్ అనిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News