ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ సమ్మయ్య
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
రాష్ట్రములోని మొత్తం (130) మునిసిపాలిటీలలో ఎన్నికకాబడిన పాలకవర్గ కాలపరిమితి తేదీ: 27-01-2020 నుండి తేదీ: 26-01-2025 రోజు వరకు ముగిసింది. నూతన వార్డు సభ్యులు మరియు చైర్ పర్సన్ ను ఎన్నుకోబడే వరకు తేదీ: 25-01-2025 మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ (MA) డిపార్ట్ మెంట్ అనుబంధము ద్వారా ప్రత్యేక అధికారులను నియమించినారు. హుజురాబాద్ మునిసిపాలిటీ ప్రత్యేక అధికారిగా ప్రఫుల్ దేశాయ్ I.A.S., జిల్లా అదనపు కలెక్టర్ (LB), కరీంనగర్ తేదీ: 27-01-2025 రోజున పురపాలక సంఘ కార్యాలయము హుజురాబాద్ నకు ప్రత్యేక అధికారిగా భాధ్యతలు స్వీకరించినారు. అనంతరం ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ I.A.S., జిల్లా అదనపు కలెక్టర్ గారికి కమిషనర్ సల్వాది సమ్మయ్య ఘనంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.





