Thursday, January 22, 2026

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి

  • నేటి సాక్షి చేర్యాల్ : చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యలయం ముందు సోమవారం ఉదయం 11:00 గంటలకు నిరసన తెలుపుతూ కలెక్టర్ కు మెమోరండం సమర్పించాలని నిర్ణయించడం జరిగింది. చేర్యాల ప్రాంత ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. చేర్యాల డివిజన్ కావాలని గత ఎనమిది సంవత్సరాలు గా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట, చేర్యాల టౌన్, ప్రజల కోరిక చేర్యాల డివిజన్ కావాలని అంచెలంచల పోరాటం జరుగుతున్నది.దీనిని మరింత ఉదృతి చేయాలనీ ఈ ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం లో బిఆర్ఎస్, బిజెపి, సిపిఎం, టిఎంఆర్పి, పార్టీలు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొంటున్నాయి. పార్టీల కు అతీతంగా జరిగే ఈ కార్యక్రమం లో అన్నీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకలాభరణం నరసయ్య పంతులు కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News