- చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది

నేటి సాక్షి చేర్యాల : చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన అనంతరం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల టౌన్ చేర్యాల మద్దూరు కొమరవెల్లి దుల్మిట మండలాల జేఏసీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెవిన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ పకలాభరణం నరసయ్య పంతులు మాట్లాడుతూ. గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని సంక్రాంతి లోపు డివిజన్ ఏర్పాటు చేయాలి లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం గతంలో డివిజన్లో అన్ని ఆఫీసులో ఉండేవి ఇప్పుడు తరలిపోయినవి మళ్లీ డివిజన్ ఏర్పడితేనే వస్తాయి అభివృద్ధికి ఒకే ఒక ఆటంకం రెవిన్యూ డివిజన్. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఈ కార్యక్రమంలో సిపిఐ బిఆర్ఎస్ బిజెపి టిడిపి టీ ఎం ఆర్ పి ఎస్ పార్టీలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు. మున్సిపల్ చైర్ పర్సన్ అంకుల్ గారి స్వరూప రాణి ఆమదాల మల్లారెడ్డి బూర్గు సురేష్ గౌడ్ ముస్తాల బాల నరసయ్య ఒగ్గు రాజు వెంకటరెడ్డి మేక సంతోష్ కొంగర వెంకట్ మావో పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.





