నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్):
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని, దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి విన్నవించగా విప్ వెంటనే స్పందించి బుధవారం రోజున ఇరిగేషన్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూధర్మారం మండలంలోని మేడారం చెరువుకు గొప్ప చరిత్ర ఉందని, గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ఇట్టి చెరువును రిజర్వాయర్ గా మార్చి పైప్ లైన్ ద్వారా సిరిసిల్ల సిద్దిపేట కు హరీష్ రావు నీటిని తరలించడం జరిగిందని, అయినప్పటికీ ఇక్కడి బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీటి అవసరం ఎంత ఉంది, నీళ్ళ వాట ఎంత వంటి వాటిని గత పాలకులు పట్టించుకోలేదని, గత పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని, ధర్మపురి తలపున గోదావరి ఉన్న, ధర్మారం మండలంలో మేడారం రిజర్వాయర్ ఉన్న ఇక్కడి రైతంగానికి సాగు నీరు అందించే విషయంలో గత పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని, నేను స్వయంగా ఇట్టి విషయాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారు వెంటనే స్పందించి గోదావరిలో ఒక టీఏంసి నీటినీ విడుదల చేయడం జరిగిందని, మేడారం రిజర్వాయర్ ను కూడా ఈ రోజు నింపడం జరుగుతుందని, త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్మపురి నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని, వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ఇరిగేషన్ పైన ఒక రివ్యూను ఏర్పాటు చేసి సాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు





