Sunday, March 22, 2026

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

  • డాక్టర్ యండి సలావుద్దీన్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా నూతన ఔషధ ప్రక్రియ వేగవంతం అవుతుందని బెంగళూరు ఆర్ అమీన్ ఫార్మర్సి కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపాల్ యండి సలావుద్దీన్ తెలిపారు. మండలంలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ కోసం అధునాతన సాంకేతిక పద్ధతులు అనే అంశంపై సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ నిరంతర పెట్టుబడి సహకారంతో సంచలనాత్మక ఆవిష్కరణల సంభావ్యత అపరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన్ బాబు,అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్న రాజు అకాడమీ డైరెక్టర్ శరవణ కుమార్, బోధన సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News