Monday, March 23, 2026

నెహ్రూ యువ కేంద్రం, హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో అడ్వెంచర్ క్యాంప్

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : నేడు నెహ్రూ యువ కేంద్రం, హనుమకొండ జిల్లా “మై భారత్” ప్రోగ్రామ్ కింద వరంగల్ కోట, గుండు చెరువు పరిసర ప్రాంతంలో అడ్వెంచర్ క్యాంప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం ఉప దర్శకుడు చింతల అన్వేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గుగు లోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ, “అడ్వెంచర్ క్యాంప్ ద్వారా శారీరక దృఢత్వ, ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పని చేసే నైపుణ్యం, సహకార భావన, సమస్యల పరిష్కార సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, భయాలను అధిగమించడం వంటివి అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా, బాలికలు తమ సామర్థ్యాన్ని ఏ రంగంలోనైనా ప్రదర్శించవచ్చు” అని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు గా హాజరైన జాతీయ యువజన పురస్కార గ్రహీత మండల పరశురాములు (భారత ప్రభుత్వ పురస్కార విజేత) మాట్లాడుతూ, “అడ్వెంచర్ క్యాంప్ అనేది ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తూ, శారీరక, మానసిక మరియు సామాజిక నైపుణ్యాలను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది. ఇది వ్యక్తులను తమ పరిమితులను దాటి ముందుకు సాగేందుకు ప్రోత్సహించి, సహజ వాతావరణాన్ని మరింతగా అర్థం చేసుకునేలా చేస్తుంది” అని అన్నారు. ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మై భారత్’ కార్యక్రమం ద్వారా యువతకు గొప్ప వేదికగా మారుతోంది. ఇంకా, “భారత ప్రభుత్వం అంతర్జాతీయ యువ మార్పిడి కార్య క్రమాలను ప్రారంభించాలని కోరుతున్నాను” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పర్యాటక అధికారి ఎం. శివాజీ, ప్రభుత్వ పింగ్లే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డా. జి. సుహాసిని, డా. సువర్ణ (ఎన్సీసీ అధికారి), డా. మమత, డా. రత్నమాల (ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు), డా. సురేశ్ బాబు, ఆర్. రాజేశ్వరి, అడ్వెంచర్ కోచ్‌లు పి. అన్విత, ఈశ్వర్ పాల్గొన్నారు. పింగ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థినుల కోసం రాక్ క్లైంబింగ్, లేడర్ క్లైంబింగ్, కయాకింగ్, టీమ్ బిల్డింగ్ వంటి మొత్తం అడ్వెంచర్ కార్య కలాపాలను విజయవంతంగా నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News