నేటి సాక్షి, కరీంనగర్: స్థానిక భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ఓటును వినియోగించుకునే విధానంతో పాటు చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా ఎన్నికలను పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులందరూ ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. పోటీ చేసే విద్యార్థులు వారి గుర్తులను తెలుపుతూ పోటీ తత్వంతో ఓటు వేయాలని అభ్యర్థించడం, ఫలితాల కోసం వేచి చూడడంలాంటి ఘటనలను ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో పాఠశాల హెడ్ గర్ల్‌గా సఫా ఫాతిమా, హెడ్ బాయ్‌గా వై విశ్వక్సేన్, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా పీ రిష, డిప్యూటీ హెడ్ బాయ్‌గా వీ శ్రేయాస్ ఎన్నికయ్యారు. అలాగే, టోపాజ్ హౌస్ కెప్టెన్‌గా యశస్విన్, ఎమరాల్డ్ హౌస్ కెప్టెన్‌గా సాన్వి, సాఫైర్ హౌస్ కెప్టెన్‌గా సిరివెన్నెల, స్పోర్ట్స్ మినిస్టర్‌గా రుతేష్, క్రమశిక్షణా కమిటీ మినిస్టర్‌గా సుశాంక్ విజయం సాధించారు.
ఎన్నికల పర్వాన్ని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్ సౌగాని అనుదీప్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్య ప్రజల ఆయుధమని, దేశాభివృద్ధికి ఆయువు పట్టు అని చెప్పారు. అలాగే చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు బాల్యం నుంచే పెంచడం, భారత ప్రజాస్వామిక విలువలపై గౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.