Friday, August 1, 2025

టీపీసీసీ లీగల్‌ సెల్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా న్యాయవాది హనుమంతు

  • – నియామకపత్రాన్ని అందజేసిన టీపీసీసీ లీగల్‌సెల్‌ చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ భిక్షమయ్య గౌడ్‌

నేటి సాక్షి, రంగారెడ్డి: టీపీసీసీ లీగల్‌సెల్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా హ్యూమన్‌రైట్స్‌, ఆర్టీఐ కన్వీనర్‌గా వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం అంతారం గ్రామానికి చెందిన భ్యాగారి హనుమంతు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ లీగల్‌సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్, టీపీసీసీ లీగల్‌సెల్‌ రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ భిక్షమయ్య గౌడ్‌ నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ భిక్షమయ్య గౌడ్‌ను న్యాయవాది హనుమంతు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ లీగల్‌సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్‌ మాట్లాడుతూ.. యువ న్యాయవాది హనుమంతుకు టీపీసీసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. టీపీసీసీ లీగల్‌సెల్‌ కోసం కృషిచేస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని ఆక్షాక్షింస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్‌సెల్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ దేవగౌడ్, టీపీసీసీ లీగల్‌సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ కుర్మ నరేందర్‌ పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది..
రంగారెడ్డి జిల్లా టీపీసీసీ లీగల్‌సెల్‌లో నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ భిక్షమమ్యగౌడ్‌కు భ్యాగారి హనుమంతు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. గౌరవ పెద్దలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తానని చెప్పారు. టీపీసీసీ లీగల్‌సెల్‌కు తన వంతు సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News